'ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలు చేయాలి'
KMM: ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తూ సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉండాలని అడిషనల్ డీసీపీ ప్రసాద్ సూచించారు. రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నేలకొండపల్లి మండల కేంద్రంలోని నామినేషన్ల కేంద్రాన్ని ఆదివారం పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ తీరును, శాంతి భద్రతల ఏర్పాట్లను వారు సమీక్షించారు.