ముద్దాయికి రెండేళ్ల జైలు, రూ.20 వేల జరిమానా

ముద్దాయికి రెండేళ్ల జైలు, రూ.20 వేల జరిమానా

BDK: గంజాయి కేసులో ముద్దాయికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. పాల్వంచ ఎక్సైజ్ పోలీసులు 2023లో 7.250 కేజీల గంజాయిని, స్కూటీతో సహా పట్టుకుని కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ అనంతరం, హనుమకొండకు చెందిన జున్ను మనోహర్‌కు ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి రెండేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.20 వేల జరిమానా విధించారు.