నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
NZB: నవీపేట్ సెక్షన్ పరిధిలోని కోస్లీ సబ్ స్టేషన్‌లో 8.0 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు పనులు మంగళవారం చేపట్టనున్నారు. ఈ పనుల కారణంగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ జీ.ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఈ సమయంలో కోస్లీ సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు చెప్పారు.