కొత్త కమిటీ సమగ్ర ప్రణాళికతో పనిచేయాలి: ఎమ్మెల్యే
NTR: నందిగామ పట్టణంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయ పాలకవర్గ ప్రమాణస్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హాజరయ్యారు. దేవాలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన దిశగా కొత్త కమిటీ సమగ్ర ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. స్వామి అనుగ్రహంతో ఈ ఆలయం ప్రాంత ప్రజలకు శాంతి, సమృద్ధి, సాత్వికతకు నిలయంగా నిలుస్తోందని పేర్కొన్నారు