'రహదారి నిర్మాణ పనులు పూర్తి చేయాలి'
ASR: డుంబ్రిగూడ మండలంలోని రంగిలసింగీ పంచాయితీ పరిధిలోని కుజాబంగి నుండి ముసురలంక వరకు వెళ్లే రహదారి నిర్మాణ పనులు పూర్తి చేయాలని స్థానిక గిరిజనులు కోరుతున్నారు. సంబంధిత గుత్తేదారులు కొంతమేర మెటల్ వేసి వదిలేసారని దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారి నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నారు.