మే 19 నుంచి ఓపెన్ స్కూల్ సప్లమెంటరీ పరీక్షలు

అనకాపల్లి జిల్లాలో ఓపెన్ స్కూల్‌కు సంబంధించి సెకండరీ బోర్డు, 10వ తరగతి పరీక్షలు మే 19 నుంచి నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు తెలిపారు. మే 28వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఈ నెల 24 నుంచి 30లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. అధికారిక వెబ్‌సైట్‌లో హెచ్.ఎం లాగిన్ నుంచి ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు.