రుణాల కోసం దరఖాస్తుల ఆహ్వానం
WNP: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న 2 వ దశ సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి, కార్పొరేషన్ ఛైర్మన్ సిరాజుద్దీన్ అహ్మద్ కోరారు. ఆసక్తి కలిగిన ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 2 లోగా http://obmms.cgg.gov.in ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించారు. రాజీవ్ యువ వికాసానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కూడా దీనికి దరఖాస్తు చేసుకొవచ్చని తెలిపారు.