కర్నూలులో 21 కొత్త కోర్టుల ఏర్పాటు

కర్నూలులో 21 కొత్త కోర్టుల ఏర్పాటు

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 21 కొత్త, అదనపు కోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. న్యాయ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ కృషితో ఈ నిర్ణయం తీసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించడంతో పాటు ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు ఈ కోర్టులు ఉపయోగపడనున్నాయి. దీంతో జిల్లాలో న్యాయ సేవలు మరింత సులభతరం కానున్నాయని తెలిపారు.