శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయ ఆదాయానికి గండి ?
కృష్ణా: పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయ ఆదాయానికి కొందరు అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై గండి కొడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అమ్మవారి ఆదాయాన్ని దారి మళ్లింది, తక్కువ ధరలకే వేలం తగ్గించుకుంటున్నారని, దీనివల్ల ఆదాయం భారీగా తగ్గిందని భక్తులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.