VIDEO: వాగుల వద్ద పోలీసుల పర్యవేక్షణ

VIDEO: వాగుల వద్ద పోలీసుల పర్యవేక్షణ

SRD: సిర్గాపూర్ మండలం గైరాన్ తండా వాగు వద్ద పోలీసులు ఇవాళ దినమంతా విధులు నిర్వహించారు. భారీ వర్షాలు కురుస్తున్నందున వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు స్థానిక ఎస్సై మహేష్ ప్రమాదకరమైన వాగుల వద్ద అప్రమత్త చర్యలు తీసుకున్నారు. గైరాన్ తండా ప్రజలు వాగు దాటి వెళ్లకుండా పహర నిర్వహించారు. ఈ సాయంత్రం వరద ప్రవాహం తగ్గిందని ఎస్సై తెలిపారు.