సుప్రీం కోర్టులో గీతం యూనివర్సిటీకి షాక్..!
VSP: గీతం యూనివర్సిటీ విద్యుత్ బకాయిల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నాలుగు వారాల్లో రూ.15 కోట్లు డిపాజిట్ చేయాలని గీతం యూనివర్సిటీకి సూచించింది. విద్యుత్ బకాయిలపై తెలంగాణ హై కోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను గీతం యూనివర్సిటీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.