ట్రాన్స్‌జెండర్లకు రూ.75 వేల సబ్సిడీ రుణాలు
SRPT: జిల్లాలోని ట్రాన్స్‌జెండర్ల ఆర్థిక పునరావాసం కోసం 100 శాతం సబ్సిడీతో రూ.75 వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి కె.నరసింహరావు ఇవాళ తెలిపారు. అర్హులైన వారు ఐడీ కార్డు, ఆదాయ పత్రాలతో ఈనెల 28లోపు కలెక్టరేట్‌లోని G-1 గదిలో దరఖాస్తు చేసుకోవాలనీ సూచించారు. 18-55 ఏళ్ల మధ్య ఉండి, గతంలో లబ్ధి పొందని వారికి ప్రాధాన్యత ఉంటుందనీ వెల్లడించారు.