VIDEO: మాగంటి సునీతను అడ్డుకున్న పోలీసులు
HYD: బోరబండ డివిజన్‌లో ఉద్రిక్తత నెలకొంది. స్వరాజ్ నగర్ పోలింగ్ బూత్‌లోకి వెళ్లకుండా BRS అభ్యర్థి మాగంటి సునీతను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యర్థికి పోలింగ్ కేంద్రాలు తిరిగే హక్కు లేదా? ఇదెక్కడి దౌర్జన్యం అంటూ పోలీసులను ప్రశ్నించారు.