వాతావరణ మార్పులపై నిపుణుల ప్రసంగం
HNK: ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో వాతావరణ మార్పులపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకతీయ యూనివర్సిటీ మైక్రోబయాలజీ విభాగాధిపతి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఈ. సుజాత నిపుణుల ప్రసంగం చేశారు. గ్లోబల్ సమస్యలు, వాతావరణ మార్పుల ప్రభావాలపై విద్యార్థులకు వివరించి, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.