'విద్యార్థులపై ఆర్ఎస్ఎస్ దాడి ఆటవిక చర్య'

'విద్యార్థులపై ఆర్ఎస్ఎస్ దాడి ఆటవిక చర్య'

PPM: ఏయూలో విద్యార్థులపై ఆర్ఎస్ఎస్ దాడి ఆటవిక చర్య అని సీపీఐ (ఎమ్ఎల్) రెడ్ స్టార్ జిల్లా కార్యదర్శి తోట జీవన్న మండిపడ్డారు. పాచిపెంట మండల కేంద్రంలో పాత బస్టాండ్ సెంటర్ వద్ద నిరసన తెలిపారు. విద్యాపరమైన శాస్త్ర, సాంకేతిక అంశాలతో మేధోమథనం జరగాల్సిన విశ్వవిద్యాలయంలో మత విద్వేషాలు వద్దన్నందుకు ఆంధ్ర యూనివర్శిటీలో ఆర్ఎస్ఎస్ బరితెగించిందని మండిపడ్డారు.