పుంగనూరు మాయావతి జన్మదిన వేడుకలు
CTR: BSP జాతీయ అధ్యక్షురాలు కుమారి మాయావతి 70వ జన్మదిన వేడుకలను ఆ పార్టీ శ్రేణులు పుంగనూరులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ కూడలిలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గ పార్టీ ఇంఛార్జ్ సురేష్ మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా ఆమె కృషి చేస్తున్నారని చెప్పారు.