'మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి'
కడపలోని మైదుకూరు పట్టణ సీఐ కే. రమణారెడ్డి గురువారం మేధా కళాశాల విద్యార్థులకు గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, సోషల్ మీడియా, ఇంటర్నెట్‌కు బానిసలు కావద్దని సూచించారు. పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ నరసింహులు, ప్రిన్సిపాల్ రాజారెడ్డి పాల్గొన్నారు.