పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం
ASR: పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా అరకులోయ పోలీస్ స్టేషన్‌లో సోమవారం సీఐ హిమగిరి అధ్యక్షతన ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అరకు ఏఎస్ఆర్ పబ్లిక్ స్కూలు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ మేరకు విద్యార్థులకు పోలీసుల విధులు, వారి ఆయుధ పరికరాలు గురించి తెలిపారు. మత్తు పదార్థాల వల్ల జరిగే నష్టాన్ని ఎస్సై గోపాలరావు వివరించారు.