గంజాయి కేసులో ఐదేళ్ల జైలు శిక్ష

గంజాయి కేసులో ఐదేళ్ల జైలు శిక్ష

SRD: గంజాయి కేసులో వ్యక్తికి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి జయంతి గురువారం తీర్పు ఇచ్చారు. మునిపల్లి మండలం పెద్ద చల్మెడ గ్రామానికి చెందిన వీరయ్య రెండు కిలోల గంజాయితో పట్టుబడ్డాడు. నేరం రుజువు కావడంతో ఐదు సంవత్సరాలు జైలు శిక్షతోపాటు 25వేల జరిమానా విధించినట్లు ఎక్సైజ్ సీఐ నజీర్ పాషా తెలిపారు.