పాక్ సైనిక స్థావరాలపై ఆఫ్ఘన్ మెరుపు దాడులు
పాక్ సైనిక స్థావరాలపై ఆఫ్ఘనిస్తాన్ మెరుపు దాడులు చేసింది. తమ దాడిలో 14 మంది పాక్ సైనికులు మృతి చెందినట్లు ఆఫ్ఘన్ వెల్లడించింది. మరో 11 మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే ఒక సాయుధ ట్యాంక్, ఒక అంతర్జాతీయ రవాణా వాహనంతో పాటు సైనిక స్థావరం పూర్తి ధ్వంసమైందని చెప్పింది. పాక్ సైనిక చర్యను కొనసాగిస్తున్న అకృత్యాలను నిరసనగానే ప్రతిదాడులు చేస్తున్నట్లు తెలిపింది.