'ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి'
NGKL: ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్య ఆరోగ్య సిబ్బంది కృషి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ కోరారు. అచ్చంపేట పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆసుపత్రులలో మందుల కొరత లేకుండా చూడాలని ప్రజలకు వైద్య సేవలు అందించాలని కోరారు.