'రహదారుల మరమ్మతులు వేగవంతంగా పూర్తి చేయాలి'

WGL: నెక్కొండ మండలంలో రహదారుల మరమ్మతులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. నర్సంపేట నియోజకవర్గంలోని నెక్కొండ, పర్వతగిరి, గూడూరు, పాకాల ప్రాంతాల్లో హైబ్రిడ్ వార్షిక నిర్వహణ కింద రోడ్ల మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రోడ్ల భవనాల శాఖ డీఈ రమాదేవి, గోపి తదితరులు పాల్గొన్నారు.