ఇది గర్వించదగ్గ విషయం: హర్మన్

ఇది గర్వించదగ్గ విషయం: హర్మన్

ఉమెన్స్ క్రికెట్ ఎదుగుదలపై భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆనందం వ్యక్తం చేసింది. జీవితంలో ఎదగడానికి బాలికలు కష్టపడాలని సూచించింది. ప్రస్తుతం ప్రజలు మెన్స్ క్రికెట్, ఉమెన్స్ క్రికెట్ అని లింగభేదం చూపించకుండా ఆదరిస్తున్నారని సంతోషం వ్యక్తం చేసింది. స్టేడియాలు ప్రేక్షకులతో నిండిపోతున్నాయని, ఇది గర్వించదగ్గ విషయమని చెప్పుకొచ్చింది.