నూతన విద్యాధికారిగా బాధ్యతలు చేపట్టిన సైదులు
SDPT: జగదేవపూర్ మండలం నూతన విద్యాధికారిగా బుధవారం బి.సైదులు బాధ్యతలను ఎంఈవో కార్యాలయం నందు స్వీకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల బలోపేతం, నిరుపేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించడమే లక్ష్యంగా, పాఠశాలలో నెలకొన్న సమస్యలపై సాధనకు కృషి చేస్తానన్నారు. అలాగే ఉపాధ్యాయులకు అన్నివేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.