చిట్వేలులో పెన్షన్ పంపిణీ కార్యక్రమం
అన్నమయ్య: ప్రతినెల మొదటి తేదీన పెన్షన్ పంపిణీ చేయడం తమ ప్రభుత్వం ధ్యేయమని టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పంతగాని నరసింహ ప్రసాద్ అన్నారు. చిట్వేలు మండలం నాగవరం గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ప్రతి నెల మొదటి తేదీన ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాధించిన విజయమని పేర్కొన్నారు.