రామప్ప ఆలయాన్ని సందర్శించిన ఐఎఫ్ఎస్ అధికారి
MLG: వెంకటాపూర్ మండలం పాలంపేటలోని ప్రపంచ ప్రసిద్ధ రామప్ప ఆలయాన్ని శనివారం పీసీసీఎఫ్ (వైల్డ్ లైఫ్) చీఫ్ వార్డెన్ వినయ్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు హరి శర్మ ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం టూరిజం గైడ్ విజయకుమార్ ద్వారా రామప్ప ఆలయ చరిత్ర, శిల్ప సంపద గురించి తెలుసుకున్నారు.