విషాదం.. మూడేళ్ల బాలుడు మృతి
ATP: రాయదుర్గంలోని గొల్లదొడ్డిలో ఓ మూడేళ్ల బాలుడు ట్రాక్టర్‌పై నుంచి పడి మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. అయితే సురేశ్ కుమార్, తన కుమారుడు బన్నీని ట్రాక్టర్ పై కూర్చోబెట్టి పొలం పనులు చేస్తుండగా, బాలుడు ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. దీంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.