ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించిన ASI

BDK: పినపాక మండలం ఈ బయ్యారం లో ఏఎస్ఐ మల్సూర్ ట్రాఫిక్ రూల్స్ గురించి అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఏ ఎస్ఐ మాట్లాడుతూ... మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి. వాహన ధ్రువీకరణ పత్రాలు తప్పక ఉండాలన్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో వాహనాలు అతివేగంగా నడపకూడదని పేర్కొన్నారు.