అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం: ఎమ్మెల్యే

NGKL: డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దామని సోమవారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లు పట్టణంలో డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకు సాగుతుందన్నారు.