గ్రామాల్లో ఓటు హక్కు పై అవగాహన ర్యాలీ

శ్రీకాకుళం: పాతపట్నం మండలం వెలుగు సిబ్బంది ఆధ్వర్యంలో మండలంలోని సీది, రంకిని గ్రామాల్లో "నీ ఓటు- నీ భవిష్యత్" అనే కార్యక్రమం ద్వారా ప్రజాస్వామ్యంలో ఓటే బలమైన ఆయుధమని నినాదించారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు 100% ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలువురు మహిళలు, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు..