ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే
KRNL: పెద్దకడబూరు మండలం తారాపురంలో వెలిసిన ఆంజనేయ స్వామిని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి శనివారం రాత్రి దర్శించుకున్నారు. కార్తీక శనివారం పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించినట్లు పేర్కొన్నారు. అంతకుముందు ఆలయ అర్చకులు కమిటీ సభ్యులు బాలనాగిరెడ్డికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.