పన్నులు వసూలు చేస్తున్నా.. వారసంతలో సౌకర్యాలు కరువు
ASF: వాంకిడిలోని వారసంత పంచాయతీకి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నా, వసతుల కల్పనలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. సంతలో సరైన షెడ్లు లేకపోవడంతో వ్యాపారులు రోడ్లకు ఇరువైపులా తాత్కాలిక డేరాలు వేసుకుని విక్రయాలు సాగిస్తున్నారు. ప్రతి వారం పన్నులు వసూలు చేస్తున్నా, కనీసం తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు వంటి కనీస సౌకర్యాలు కల్పించడం లేదని వ్యాపారులు వాపోతున్నారు.