ఎల్లంపల్లి ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తివేత

PDPL: భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుండటంతో మంచిర్యాల జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం జలకళను సంతరించుకుంది. ఆదివారం 10 గేట్లను ఎత్తి గోదావరిలోకి నీటిని వదిలారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం జలాశయంలో 18.06 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయంలోకి 62,616 క్యూసెక్కుల వరద వచ్చి చేరుకుంది.