HIGH ALERT: ప్రజలు ఏర్పాట్లు చేసుకోవాలి

పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో కేంద్రం హైఅలర్ట్ ప్రకటించింది. J&K, రాజస్థాన్, పంజాబ్, హర్యానా ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. అధికారులకు సెలవులు రద్దు చేశాయి. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాయి. అత్యవసర ఏర్పాట్లు చేసుకోవాలని ప్రజలకు సూచించాయి. మరోవైపు సరిహద్దు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ మాట్లాడారు.