'సంఘాలుగా ఉంటే రైతులకు మరిన్ని ప్రయోజనాలు'

పల్నాడు: శావల్యాపురం మండల పరిధిలోని వేల్పూరు గ్రామంలో నాబార్డ్, సెర్చ్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 11.30 గంటలకు రైతు ఉత్పత్తి దారుల సంఘం సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సీవో మాడెబోయిన గురు ప్రసాద్ మాట్లాడుతూ.. రైతులందరూ సంఘాలుగా ఏర్పడటం వలన మరిన్ని ప్రయోజనాలు పొందుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌పీవోఎండీ, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.