సిబిల్ స్కోర్ పేరిట సైబర్ క్రైమ్.. జాగ్రత్త..!
MDCL: మీ సిబిల్ స్కోర్ బాగుంది.. రూ.4 లక్షల లోన్ వస్తుందని చెప్పి నారాయణ అనే ఓ వ్యక్తికి మేడిపల్లిలో మెసేజ్ వచ్చింది. దీంతో అతను నమ్మి మెసేజ్ క్లిక్ చేయగా రూ.13,653 పోగొట్టుకున్నట్లుగా తెలిపారు. గత పది రోజులుగా మెసేజెస్ వస్తున్నప్పటికీ అంతగా పట్టించుకోలేదని, దుకాణం పెట్టడానికి ఉపయోగపడతాయని అనుకుంటే ఈ విధంగా అయినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.