కల్తీ ఐస్ క్రీమ్‌లు విక్రయం.. వ్యక్తి అరెస్ట్

HNK: హసన్‌పర్తి మండల కేంద్రంలో కాలం చెల్లిన ఐస్ క్రీమ్‌ల ఉత్పత్తులను సరఫరా చేస్తున్న అను మార్కెటింగ్ ఐస్ క్రీమ్ డిస్ట్రిబ్యూటర్స్‌పై టాస్క్ ఫోర్స్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వారి వద్ద సుమారు రూ.48 వేల విలువ గల కాలం చెల్లిన ఐస్ క్రీమ్ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కొరకు నిందితులను హసన్‌పర్తి పోలీసులకు అప్పగించారు.