విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు

విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు

ప్రకాశం: గిద్దలూరు మండలంలోని దిగువమెట్ట గ్రామ సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో నంద్యాల నుండి గిద్దలూరు వైపు వెళ్తున్న కారు టైర్ పంచర్ కావడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని స్థానిక ప్రజలు తెలిపారు.