చర్లపల్లి, తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు

HYD: వేసవి సెలవులు నేపథ్యంలో తిరుపతికి వెళ్లే రైల్వే యాత్రికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ఈ సందర్భంగా చర్లపల్లి, తిరుపతి మధ్య 16 ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ రైలు మే 7వ తేదీ నుంచి జూన్ 25వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ప్రతిరోజు సా.6:50 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి మరుసటి రోజు తిరుపతికి చేరుకుంటుంది.