బాధ్యతలు చేపట్టిన నూతన ఛైర్మన్
JGL: ప్రజలందరి సహకారంతో మెట్‌పల్లి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, జిల్లాలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చి దిద్దుతానని మెట్‌పల్లి పురపాలక నూతన ఛైర్మన్ మైలారం లింబాద్రి అన్నారు. బల్దియా ఛైర్మన్‌గా ఎన్నికైన ఆయన శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి జువ్వాడి నర్సింగరావు ఆధ్వర్యంలో బాధ్యతలు చేపట్టారు.