DFOను కలిసిన ఎమ్మెల్యే పులివర్తి నాని

DFOను కలిసిన ఎమ్మెల్యే పులివర్తి నాని

TPT: చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని జిల్లా అటవీశాఖ అధికారి సాయిబాబాను శనివారం కలిశారు. ఇందులో భాగంగా బీటీఆర్ కాలనీ 5వ లైనులో స్వయంభుగా వెలిసిన కట్ట పుట్టాలమ్మ దేవాలయం విషయంలో ఫిర్యాదు చేశారు. ఏ విధమైన సమాచారం ఇవ్వకుండానే ఆలయాన్ని కూల్చివేయడం ప్రజల్లో తీవ్ర ఆవేదనకు దారితీసిందన్నారు. దేవాలయ పునర్నిర్మాణానికి సహకరించాలంటూ అర్జీ సమర్పించారు.