ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
SKLM: కోటబొమ్మాలి మండలంలోని సీఎం నారా చంద్రబాబు జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. సోమవారం కోటబొమ్మాలిలోని కొలువై యున్న శ్రీ కొత్త మ్మ తల్లి ఆలయంలో PACS అధ్యక్షులు బి. శేషగిరి రావు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. స్థానిక టిడిపి నేతలు పాల్గొన్నారు.