వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా లాజర్ నియామకం

PLD: YCP పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా కారంపూడి(M) ఒప్పిచర్ల గ్రామానికి చెందిన ఇరిగిదిండ్ల లాజర్‌ను నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీకి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పదవి లభించింది. తన నియామకానికి కృషిచేసిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి లాజర్ ధన్యవాదాలు తెలిపారు.