కౌంటింగ్‌లో అవకతవకలు.. కలెక్టర్‌కు ఫిర్యాదు
NRPT: ధన్వాడ మండలం పాతపల్లి గ్రామ బీజేపీ మద్దతుదారు వెంకటేష్ గౌడ్ ఎన్నికల లెక్కింపు ప్రక్రియలో అవకతవకలు జరిగాయని కలెక్టర్ సిక్తా పట్నాయక్‌కు ఫిర్యాదు చేశారు. మొదటి వార్డు పోలింగ్ సిబ్బంది స్వస్తిక్ ముద్ర ఇవ్వకుండా వేలిముద్ర వేయించారని ఆరోపించారు. ఆర్వో శ్రీనివాస్ 8 ఓట్లను చెల్లనివిగా ప్రకటించారని, ఆయన పై చర్యలు తీసుకోవాలని కోరారు.