అల్లూరులో పొలం పిలుస్తోంది కార్యక్రమం
NLR: అల్లూరు పట్టణంలోని వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఇవాళ పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు వ్యవసాయ సిబ్బంది పలు సూచనలు చేశారు. తగిన మోతాదులోనే పంట పొలాలకు ఎరువులు వేయాలన్నారు. సేంద్రీయ పద్ధతులపై ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.