మాక్ అసెంబ్లీలో విద్యార్థినీని సత్కరించిన ఎమ్మెల్యే
NTR: మాక్ అసెంబ్లీలో విద్యార్థినీని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ శుక్రవారం ఘనంగా సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నిర్వహించిన మాక్ అసెంబ్లీలో మైలవరం ఎంబీఎం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని గుల్షన్ ఆరా ఎమ్మెల్యే పాత్ర పోషించింది. పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకకు ఇటువంటి కార్యక్రమాలు దర్పణం పడుతున్నాయని ఆయన అన్నారు.