అభినయ శ్రీనివాస్‌కు “గద్దర్ పురస్కారం

నల్గొండ: మోత్కూర్ అభినయ శ్రీనివాస్‌కు ప్రతిష్ఠాత్మకమైన గద్దర్ ఐకాన్ 2024’ అవార్డు లభించింది. మలిదశ తెలంగాణ సాంస్కృతిక ఉద్యమంలో తన పదాలతో ప్రజల్లో జాగృతి నింపిన మోత్కూరు వాసి అభినయ శ్రీనివాస్ ఈ గుర్తింపుతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ అవార్డును తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో, సాయి అలేఖ్య ఫౌండేషన్ నిర్వహించిన 32వ వార్షికోత్సవ కార్యక్రమంలో ప్రదానం చేశారు.