గౌరారం పోలీస్ స్టేషన్‌ను పరిశీలించిన ఏసీపీ

SDPT: గజ్వేల్ ఏసీపీ నరసింహులు వార్షిక తనిఖీల్లో భాగంగా గౌరారం పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్టేషన్ పరిసరాలు, రిసెప్షన్, సీజ్ చేసిన వాహనాలు, కేసుల్లో స్వాధీనం చేసుకున్న వస్తువులను పరిశీలించారు. రికార్డులు, సీడీ ఫైళ్లు, సిబ్బంది కిట్ ఆర్టికల్స్‌ను తనిఖీ చేసి, సిబ్బంది బాధ్యతలు, విధుల నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు.