వచ్చే నెల 15 నుంచి 'నో హెల్మెట్ - నో ఫ్యూయల్'

వచ్చే నెల 15 నుంచి 'నో హెల్మెట్ - నో ఫ్యూయల్'

BPT: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని బాపట్ల సీఐ రాంబాబు సూచించారు. ఆదివారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించి, మాట్లాడారు. ఏప్రిల్ 15 నుంచి పట్టణంలో 'నో హెల్మెట్ - నో ఫ్యూయల్' నిబంధన అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రాణ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు విజయకుమార్, నశ్రీన్, తదితరులు పాల్గొన్నారు.