ఇళ్లు నిర్మించుకోలేని వారికి.. షేర్ టెక్నాలజీతో నిర్మాణం
MDK: ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోలేని పేదలకు షేర్ టెక్నాలజీస్ ద్వారా ఇల్లు నిర్మించి అందజేయనున్నట్టు గృహ నిర్మాణ శాఖ ఏఈ రియాజ్ తెలిపారు. చేగుంట మండలం వడియారంలో ఇందిరమ్మ లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. 32 ఇళ్లు మంజూరు కాగా 20 ఇళ్లకు మాత్రమే నిర్మాణ పనులు జరుగుతున్నట్టు తెలిపారు. ఒకటి రద్దు కాగా, 11 నిర్మాణాలు ప్రారంభించలేదన్నారు.